ATP: పెద్దవడుగూరు మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో శుక్రవారం భూ సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు రైతులు కలిసి పోలీసు రెవెన్యూకు సంబంధించిన అర్జీలను అధికారులకు అందజేశారు. భూ సమస్యల వల్ల గ్రామాల్లో గొడవలు జరగరాదని, మీ సమస్యలను రెవెన్యూ పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు.