VZM: నారీ శక్తి పథకం కింద డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు రామభద్రపురం వెలుగు ఏపీఎం అన్నపూర్ణ తెలిపారు. ఈ పథకం కింద మండలంలో 54 మంది మహిళలను గుర్తించామని, వీరికి బ్యాంకర్ల ద్వారా రుణాలు మంజూరు చేయనున్నామని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు.