AP: డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నేడు టీటీడీ నిర్వహించనుంది. స్థానిక అన్నమయ్య భవన్లో ఉ.9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలు తెలిపేందుకు ఈ అవకాశం కల్పించినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు 0877-2263261 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.