శ్రీకాకుళం: పలాసకు చెందిన సీనియర్ రచయిత, నటులు, జనజాగృతి సాహితీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ డా. తెప్పల కృష్ణమూర్తికి అత్యంత ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారం లభించింది. హైదరాబాద్లో డాక్టర్ దేవులపల్లి ఆదర్శ కళానిలయంలో సాహితీ రంగం, లయనిజంలోను 3దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్నందుకు ఈ పురస్కరం అందజేసినట్లు వేదికపై ప్రకటించారు.
ELR: జిల్లాలో భారీవర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో 207 ఇళ్లు దెబ్బతిన్నట్టు సమాచారాన్ని నమోదు చేశారని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. వరద నష్టాలుయాప్‌లో నమోదుపై సంబంధిత అధికారులతో ఆదివారంకలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ.. జాబితాను కలెక్టరేట్‌లో ప్రదర్శించారని ఇళ్లు నష్టపోయిన బాధితులకు ఈ నెల 25న అందజేస్తామన్నారు.
ప్రకాశం: డాన్ బాస్కో సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఒంగోలులోని దాన్ బాస్కో ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రధానాచా ర్యులు రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా, బీటెక్, బీ. ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్ధులు ధ్రువ పత్రాలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
NDL: మిడ్తూరు మండలం ఖాజిపేట గ్రామంలో రచ్చకట దగ్గర కరెంటు తీగలు ప్రమాదకరంగా మారాయి. రావి చెట్టు కొమ్మల మధ్య నుంచి వైర్లు వెళ్లాయి. ఇక్కడ ఉండే ఆరుగు మీద పెద్దలు, పిల్లలు సేదతిరుతుంటారు. ఈదురు గాలులు వీస్తున్న సమయంలో మంటలు చెలరేగుతున్నాయని గ్రామ ప్రజలు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగక ముందే అధికారులు కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.
ATP: వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కార్యదర్శి సంజీవరాయుడు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి విద్యాశాఖ అధికారి వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. జోనల్ గ్రిగ్స్ నిర్వహణపై చర్చిస్తామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులంతా తప్పకుండా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
KRNL: మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంటలో వెలసిన కర్రీ వీరభద్ర స్వామి రథోత్సవం రస్తాకు ఇరువైపుల ఉన్న దాదాపు 70 ఏళ్ల నాటి పురాతన వృక్షాలను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్రీ వీరభద్రస్వామి దేవాలయం ధర్మకర్త రాఘవరెడ్డి ఆదివారం తెలిపారు.
TG: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలో 11 జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి సహా నారాయణపేట్ జిల్లాల్లో భారీ ...
కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారు కార్మికులుగా నమోదు చేసుకోవాలని కోనసీమ జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ టి. నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కార్మికులుగా నమోదు చేయించుకున్న వారు రెన్యువల్ చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
SKLM: సారవకోట మండలం బూతడి గ్రామంలో ప్రాఖ్యత గాంచిన కంచు, ఇత్తడి కార్మికులు తమ నైపుణ్యంతో ఆంధ్రరాష్ట్ర చిహ్నంలో ఉన్న పూర్ణ ఘటం తయారు చేశారు. గ్రామానికి చెందిన కింతాడ అప్పారావు ఆయన కుమారుడు బుజ్జి సుమారు 40 రోజులు శ్రమించి 12 కేజీల ఇత్తడితో ఈ పూర్ణకుంభం తయారు చేశారు. దీనిని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు తయారీ దారులు తెలిపారు.
WG: విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ దాతలు విరాళాలు అందిస్తున్నారు. తణుకు మండలం వీరభద్రపురంలో బెతేల్ అసెంబ్లీ చర్చ్ తరుపున సీఎం సహాయనిధికి రూ. 2 లక్షలు విరాళాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు సభ్యులు చెక్కును ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అభినందించారు. బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలన్నారు.
ATP: బుక్కపట్నం మండలం పాముదుర్తిలో నేడు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు నిర్వహించే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించనున్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి పాల్గొననున్నారు.
NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో హైడ్రాను వెంటనే అమలు చేయాలని భారత్ ముక్తి మూర్చ ఇంచార్జ్ గడ్డం విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. అక్రమ కట్టడాలు వెంచర్లు వేస్తూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న వారిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
AKP: మాడుగులలో ఆదివారం రాత్రి బ్రహ్మ కమలం పువ్వులు విరబూసాయి. తాడి బంగారయ్య ఇంట్లో ఈ బ్రహ్మ కమలాల పువ్వులు పూశాయి. అరుదుగా కనిపించే ఈ బ్రహ్మ కమలాల పువ్వులను చూసిన మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం తమ బంధువులు ఇంటి నుంచి ఈ మొక్కను తెచ్చి పెరట్లో నాటామని మహిళలు పేర్కొన్నారు.
కృష్ణ: తిరువూరు నియోజవర్గం తిరువూరు మండలం కొత్తకోకిలంపాడు గ్రామంలో కోడిపందాలపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తిరువూరు పోలీసులు తెలిపారు. వీరు నుండి 14 బైకులు రూ.18,000 నగదు, రెండు పందెం కోళ్ళు, నాలుగు కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తిరువూరు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
ప్రకాశం: దోర్నాల మండలం అయినముక్కల గ్రామ సమీపంలో ఆదివారం నీటి కోసం స్థానిక గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. గత కొద్దిరోజులుగా నీటి సమస్యతో తీవ ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ముళ్ళ కంచె వేసి మరి నిరసన తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు పట్టించుకోని నీటి సమస్య పరిష్కరించాలన్నారు.