• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా వినాయక శోభాయాత్ర

SRD: పుల్కల్ మండలం గంగ్లురు గ్రామంలో వినాయక శోభాయాత్ర కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మండపంలో ప్రత్యేక పూజలు చేసి వాహనాలపైకి వినాయక విగ్రహాలను ఎక్కించారు. శోభాయాత్రలో మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయకుని నామస్మరణ చేస్తూ భక్తులు ముందుకు సాగారు. సమీపంలోని చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.

September 23, 2024 / 07:26 AM IST

డీపీవోగా వెంకట నాయుడు

ప్రకాశం: జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా గొట్టిపాటి వెంకటనా యుడు నియమితులయ్యారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా డ్వామా ఫైనాన్స్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీపై వస్తు న్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యసాయి జిల్లాకు చెందిన ఆయన 1990లో ఖజానాశాఖలో ఉద్యోగిగా చేరి, 1999లో గ్రూప్1లో ఎంపికయ్యారు.

September 23, 2024 / 07:25 AM IST

‘ప్రజా వేదిక గ్రీవెన్స్‌కు అన్ని శాఖల అధికారులు హాజరుకావాలి’

PLD: పెదకూరపాడులోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్న ప్రజా వేదిక గ్రీవెన్స్‌కు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని తహశీల్దార్ డానియల్ కోరారు. రెండు, మూడు వారాలుగా వివిధ కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడిందని చెప్పారు. 11 నుంచి 4 గంటల వరకు గ్రీవెన్స్ స్పందన కార్యక్రమం ఉంటుందని, ప్రజల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

September 23, 2024 / 07:25 AM IST

వైద్యులను ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు

KMR: మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది, ఎఎన్ఎం కార్యకర్తలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వందల మంది చికిత్సకులు పాల్గొన్న మంచి సేవలు అందించడం జరగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బిబి పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార పాల్గొన్నారు.

September 23, 2024 / 07:25 AM IST

బోరు బావులకు విద్యుత్ సరఫరా వేళలు

NDL: కోవెలకుంట్ల మండలంలోని విద్యుత్ పీడర్ల పరిధిలో బోరుబావులకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఏఈ రామ్మోహన్ తెలిపారు. కోవెలకుంట్ల, గులదుర్తి, కలగొట్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని బోరుబావులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని వెల్లడించారు. రైతులు గమనించాలని సూచించారు.

September 23, 2024 / 07:25 AM IST

నేడు శ్రీలంక అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణం

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షవాద నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇవాళ శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 42.31 శాతం ఓట్లు అనుర కుమార సాధించారు. జనతా విముక్తి పెరమున పార్టీకి చెందిన అనుర కుమార రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయాన్ని దక్కించుకున్నారు.

September 23, 2024 / 07:25 AM IST

NMMS స్కాలర్ షిప్‌కు దరఖాస్తులు

WG: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందేందుకు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని యలమంచిలి ఎంఈవో–2 కనుమూరు వెంకట రామకృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, పురపాలక, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

September 23, 2024 / 07:25 AM IST

యువతలో సెల్ఫీ పిచ్చి పెరిగిపోతోంది

WGL: సెల్ఫీలు దిగాలి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇందు కోసం కొందరు ఎంత దూరమైనా వెళ్తున్నారు. చివరికి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కాజీపేట కడిపికొండ సమీపంలో ర్తేల్వేట్రాక్ పై ఆగివున్న గూడ్స్ రైలు మీద ఎక్కి సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్న క్రమంలో హై టెన్షన్ విద్యుత్ ఘాతానికి గురై 70% కాలిన గాయాలతో ఆదివారం వరంగల్ ఎంజీఎంకు 108లో తరలించారు.

September 23, 2024 / 07:24 AM IST

సబ్ రిజిస్ట్రార్ల బదిలీలకు కౌన్సిలింగ్

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ జోన్‌–2లో సబ్‌ రిజిస్ట్రార్ల బదిలీలకు ఆదివారం ఏలూరులోని ఆ శాఖ డీఐజీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ప్రారంభించారు. జూన్ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం 93 మంది సబ్‌ రిజిస్ట్రార్లు ఈ బదిలీల్లో స్థాన చలనం పొందుతారని, సుమారు 120 మంది సీనియర్‌ అసిస్టెంట్లకు బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అధికారులు పేర్క...

September 23, 2024 / 07:22 AM IST

పలు ఆలయాల్లో ఉద్యోగులు బదిలీలు

WG: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఉద్యోగులను బదిలీలు చేస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఈఈ వి.నూకరత్నంను ద్వారకాతిరుమల దేవస్థానానికి రెండో ఈఈగా నియమించారు. విజయవాడ దేవస్థానంలో అసిస్టెంట్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్న బి.అశోక్, ద్వారకాతిరుమలకి బదిలీ చేశారు.

September 23, 2024 / 07:20 AM IST

‘డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన పడొద్దు’

AP: ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల టెట్ హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అందులో కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది సాంకేతిక తప్పిదం వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అభ్యర్థులు హాల్ టికెట్లతో డీఈవో ఆఫీసును సంప్రదించాలని తెలిపారు.

September 23, 2024 / 07:20 AM IST

నేడు జిల్లాలో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం

KRNL: నగరంలో రెండు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు. వీటిని మంత్రి టి. జి. భరత్ సోమవారం పునః ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో అనంతరం కొండారెడ్డి బురుజు సమీపంలోని క్యాంటీన్లను ప్రారంభిస్తారని ఆయన కార్యాలయం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.

September 23, 2024 / 07:19 AM IST

మాల్ న్యూట్రిషన్పై విద్యార్థుల మారథాన్ రన్

MBNR: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఎంతోజియా పేరుతో కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 5 కి.మీ మారథాన్ రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వరకు రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాల్ న్యూట్రిషన్‌పై అవగాహన కల్పించారు.

September 23, 2024 / 07:18 AM IST

గద్వాల టౌన్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కళ్యాణ్ కుమార్

GSWL: పట్టణ ఎస్సైగా కళ్యాణ్ కుమార్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలిగి, శాంతి భద్రతల పరిరక్షణలో భాగం కావాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పాటునందించాలన్నారు.

September 23, 2024 / 07:18 AM IST

తునిలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

తూ.గో: తుని మండలం తేటగుంట సమీపంలోని పాత చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. అన్నవరం దేవస్థానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గోవిందు(26) బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గోవిందు తలకు బలమైన గాయమైంది. 108లో హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు.

September 23, 2024 / 07:18 AM IST