కాకినాడ: రాజమహేంద్రవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారా విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేశామని సీఐ దుర్గారావు తెలిపారు. ఆమె వద్ద నుంచి ఐదు లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో అరెస్టు చేసిన ఐదు బండ్ల మార్కెట్‌కు చెందిన మహిళను కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అక్రమంగా మద్యం, సారా విక్రయించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
WNP: కార్మిక చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తుందని వనపర్తి ఆర్టిసి డిపో SWF అధ్యక్షులు జేవి స్వామి అన్నారు. సోమవారం డిపో ముందు కార్మికులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలంగా 4కోడ్‌లుగా సవరించిందని విమర్శించారు.
MLG: జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలోని రామప్ప దేవాలయానికి ఉపాలయం అయిన గొల్లాలగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు పైకప్పు తొలగించారు. అంతేకాక ఆలయంలోని శిల్పాలతో పాటు శివలింగంను పెకిలించి ధ్వంసం చేశారు. కాగా.. పురావస్తు శాఖ అధికారులు సంబంధిత పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
AP: వంద రోజుల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని CM చంద్రబాబు చెబుతున్నారు. పింఛన్ రూ.4వేలకు పెంచడం, అన్నా క్యాంటీన్లు ప్రారంభం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు ఇలా ఎన్నో చేశామని కూటమి నేతలు పేర్కొన్నారు. అయితే 100 రోజుల పాలన ఫెయిల్ అయిందని.. అందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని YCP నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనకు YS షర్మిల ‘0’ మార్కులు వేసిన విషయం తెలిస...
SRD: రాయికోడ్ మండల కేంద్రంలో వెలసిన గ్రామ దేవత భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. గ్రామస్తులు, ఇతర ప్రాంతాల భక్తులు తమ ఆరాధ్య దేవతను దర్శించేందుకు ఆలయానికి తరలివచ్చి స్థానిక అమృత గుండంలో పుణ్యస్నానమాచరించి స్వామివారికి పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కడప: బుడమేరు ప్రళయ విలయతాండవం చేసి విజయవాడ ప్రజలను అతలాకుతలం చేసిన వరద ప్రాంతాల్లో జిల్లా నుంచి నూర్ భాషా దూదేకుల సంఘం వారు తమ వంతు సాయం అందజేశారు. పాత రాజరాజేశ్వరి పేట గొల్లపూడి, బొమ్మసాని సుబ్బారావు నగర్ ప్రాంతాలలో నివసిస్తున్న 250 పేద కుటుంబ ప్రజలకు దుప్పట్లు, టవళ్లు, లుంగీలు, చీరలు పంపిణీ చేశారు. ఓబులేశ్ ఇందాదుల్లా, ఖాదరయ్య, తదితరులు పాల్గొన్నారు.
SRPT: సీజనల్ వ్యాధులు రాకుండా సూర్యాపేట మున్సిపాలిటీ విభాగం వారితో సోమవారం 27 వార్డులో దోమల లార్వా నిర్మూలనకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్టు కింద ఫాగింగ్, ఖాళీ స్థలాల్లో ఉన్న నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందని వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతతో తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.
తూ.గో: గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి గ్రామ సమీపంలో నిర్మించిన అస్సాగో ఇథనాల్ పరిశ్రమ నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నామంటూ స్థానికులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. పరిశ్రమ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్వాసనతో శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర వుతున్నాయని అన్నారు.
NDL: బనగానపల్లి పట్టణంలోని కొండపేట కాలనీలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న టపాసుల దుకాణంపై సీఐ కృష్ణయ్య యాదవ్ ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో రాజా ప్రసాద్ అనే వ్యక్తి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న రూ.52 వేల విలువచేసే టపాసులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని తెలిపారు. అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు చేపడతామన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రెండు ర్యాలీల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పూంచ్‌లోని సురాన్‌కోట్‌కు చేరుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి షానవాజ్ చౌదరికి మద్దతుగా పబ్లిక్ ర్యాలీలో ప్రసంగిస్తారు. అనంతరం షాల్టెంగ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలోనూ ఆయన పాల్గొంటారు.
GNTR: తుళ్లూరు మండలం రాయపూడిలో ఓ బైక్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుమార్ తన బైక్‌ను ఈ నెల 19న ఇంటి వద్ద నిలిపాడు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు వాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు.
NRML: ఎగువ కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 547 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు సోమవారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 358.70కు చేరగా.. ఒక గేటు ద్వారా 507 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.
తూ.గో: యానాంలో రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ విజయం సాధిస్తే తాను గుండు గీయించుకుంటానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బహిరంగంగా ప్రకటించారు. ఆదివారం సాయంత్రం యానాం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని ఉన్న సూర్య క్లబ్ ఎదురుగా మల్లాడి ఆందోళన చేపట్టారు.
NDL: బేతంచెర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర రావు మండల పరిధిలో గల రౌడీ షీటర్లకు బేతంచెర్ల పోలీస్ స్టేషన్ నందు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా, ఎంతటి వారైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నేర పూరిత కార్యక్రమాలకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితం గడపాలని సోమవారం అన్నారు.
బాపట్ల: కొరిశపాడు మండలం గుడిపాడు జాతీయ రహదారి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లం లోడుతో కర్ణాటక నుండి కోల్ కత్తా వెళుతున్న లారీ గుడిపాడు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. హైవే పోలీసులు వెంకటరామయ్య, రాజాలు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.