• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సంక్షేమ హాస్టలపై చిత్తశుద్ధి చూపించాలి’

BDK: రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ సంక్షేమ హాస్టల్లపై చిత్తశుద్ధి చూపించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అజిత్ అన్నారు. సోమవారం పాల్వంచ చండ్ర రాజేశ్వర రావు భవన్లో జరిగిన ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు గిరిజన, పేద విద్యార్థులని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలన్నారు.

September 23, 2024 / 11:56 AM IST

తన ఇంటిపై దాడి.. స్పందించిన సునీతా లక్ష్మారెడ్డి

TG: మెదక్ జిల్లాలోని గోమారంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గ్రామంలో తలెత్తిన ఘర్షణలపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. తమ గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని తెలిపారు. గొడవ జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. తన అనుచరులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. తన ఇంటిపై రాళ్లు విసిరిన నిందితులు, బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చ...

September 23, 2024 / 11:55 AM IST

అక్రమ కట్టడాలు కూల్చివేత

కాకినాడ: సంత చెరువు దుర్గమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో డ్రెయిన్‌‌పై అక్రమంగా నిర్మించిన కొన్ని దుకాణాలను నగర కమిషనర్‌ ఆదేశాల మేరకు డీసీపీ పర్యవేక్షణలో మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది సోమవారం తొలగించారు. భారీ క్రేన్‌ సహాయంతో వీటిని కూల్చివేశారు. అక్రమ కట్టడాలు అయినందున నిబంధనల ప్రకారం కూల్చివేత కార్యక్రమం జరుగుతుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

September 23, 2024 / 11:55 AM IST

అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

కడప: మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు జింకా సాంబయ్య స్వామివారి మూలవిరాట్టుకు జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

September 23, 2024 / 11:55 AM IST

‘ఇసుక విధానంపై ఆర్డీవోకు సీపీఎం నేతల వినతి పత్రం’

NLR: ఇసుకను ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం తెలిపిన తమకు ఉచితంగా ఇసుక అందని కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారని వెంటనే ప్రభుత్వం తమకు ఇసుకను ఉచితంగా అందించాలని తెలుపుతూ ఆత్మకూర్ సీపీఎం పార్టీ నేత నాగయ్య ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీవో మధులతకు వినతిపత్రం అందించారు.

September 23, 2024 / 11:54 AM IST

అంగప్రదక్షిణ టికెట్లు విడుదల

తిరుపతి: డిసెంబర్ నెల కోటాకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్లను సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, పెద్దలు, దివ్యాంగులకు సంబంధించిన నవంబర్ నెల ఉచిత దర్శన కోటా టికెట్‌ను విడుదల చేయనుంది. కాగా.. రేపు ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది.

September 23, 2024 / 11:54 AM IST

సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

GDWL: కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి.. సుప్రీం తీర్పను అమలు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో గద్వాల్ పాత బస్టాండ్‌లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ, కార్మికులు మజ్జిగ ఆంజనేయులు, నరేష్, బాబన్న, పాల్గొన్నారు.

September 23, 2024 / 11:54 AM IST

టీయుడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

BPL: జిల్లా కేంద్రంలోని స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్‌లో సోమవారం టీయు డబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమయింది. ఈ సందర్భముగా జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్, రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులు సామల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. ఆసక్తి గల జర్నలిస్టులు సభ్యత్వం తీసుకోవాలని, పాత సభ్యత్వం ఉన్నవారు కూడా రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు.

September 23, 2024 / 11:53 AM IST

ఇందుకూరుపేటలో స్థానికులకు వైద్య పరీక్షలు

NLR: ఇందుకూరుపేట గ్రామంలో సోమవారం 104 సిబ్బంది ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.చేపలు,రొయ్యల చెరువులు, ఇటుక బట్టీల వద్ద తాత్కాలికంగా ఉంటున్న గర్భవతులకు బాలింతలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. రాబోయేది వర్షాకాలం కావున తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి వివరించారు.

September 23, 2024 / 11:52 AM IST

జోనల్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జోనల్ గేమ్స్‌ను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాల్వంచ మొలకలపల్లి బూర్గంపాడు మండల విద్యార్థులు ఎమ్మెల్యేకు గౌరవ వందనం సమర్పించారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడారంగంలో కూడా రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

September 23, 2024 / 11:52 AM IST

స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి

VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద కమిటీ ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. 4లేబర్ కోర్టులను రద్దు చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ను నడపాలన్నారు.

September 23, 2024 / 11:51 AM IST

పుష్ప- 2 రిలీజ్ “కౌంట్ డౌన్” పోస్టర్ విడుదల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘పుష్ప- 2’.  పుష్పకు సీక్వెల్‌గా పుష్ప 2 రాబోతుంది. డిసెంబర్ 6న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ “కౌంట్ డౌన్” పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫ్యాన్స్ కోరిక మేరకు కేవలం 75 రోజుల్లోనే పుష్పరాజ్ రూలింగ్ చూడబోతున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

September 23, 2024 / 11:51 AM IST

‘ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన నీటిని అందించాలి’

NRML: గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో మిషన్ భగీరథ నీటి సమస్యలపై సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన నీరును అందించాలని, ఎటువంటి సమస్యలున్న వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

September 23, 2024 / 11:51 AM IST

గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం

BPT: కొరిశపాడు మండలం గుడిపాడు జాతీయ రహదారి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లం లోడుతో కర్ణాటక నుండి కోల్‌కత్తా వెళుతున్న లారీ గుడిపాడు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

September 23, 2024 / 11:51 AM IST

‘రేపు అల్లాడుపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం’

కడప: చాపాడు మండల పరిధిలోని అల్లాడుపల్లెలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మ్యాగీ తెలిపారు. అలాగే మధ్యాహ్నం లక్ష్మిపేట గ్రామంలో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బుధవారం మడూరు, అన్నవరం సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

September 23, 2024 / 11:50 AM IST