ఆడవాళ్లకు పీరియడ్స్ సమయంలో నొప్పి, రక్తస్రావం వల్ల నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే అలాంటి సమయంలో ఆహారంపై దృష్టి సారించటం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కాల్షియం, ఐరన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే ఆ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మెంతులు నానబట్టి ఆ నీటిని తాగాలి. రాగులు, ఉసిరి, గుడ్లు, పాలు, జొన్నలు, మిను...
కడప: వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అనేక హామీలను అమలు చేసినఈ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని టీడీపీ నాయకులు ప్రజలను కోరారు. సోమవారం కమలాపురం నగర పంచాయతీలోని 17వ వార్డు పడమటి వీధిలో ప్యాపిలి శ్రీకాంత్ రాయల్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. వారు ప్రతి ఇంటికి వెళుతూ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమ కరపత్రాలను అందించారు.
చిత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సోమవారం పేరూరు వద్ద ఉన్న వకుళ మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాంతిపురం జడ్పీటీసీ శ్రీనివాసులు, వైసీపీ నాయకులు సురేష్, తుర్లపల్లి సర్పంచ్ మురళి, త్యాగరాజు పాల్గొన్నారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రత గురించి గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మన్యం: చిల్డ్రన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ చేంజింగ్ అసోసియేట్ ద్వారా వచ్చిన ఫేక్ అపాయింట్మెంట్లను నమ్మవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి జీ.పగడాలమ్మ తెలిపారు. విద్యాశాఖలో ఉద్యోగాలంటూ CDECA సంస్థ నిరుద్యోగుల వద్ద నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి ఇస్తుందన్నారు. ఈ సంస్థ చేతిలో మోసపోవద్దని నిరుద్యోగులను ఆమె కోరారు.
BDK: పాల్వంచ మండల ఐకేపీ సిబ్బంది సోమవారం ఎమ్మెల్యే సాంబశివరావుకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. VOAలకు 26వేల వేతనం ఇవ్వాలన్నారు. వారి వ్యక్తిగత ఖాతాల్లో డబ్బు జమ చేయాలన్నారు. SERP నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
తిరుపతి: జిల్లాలో దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా మొదటిగా వినాయకుడికి అభిషేకం చేసి మృత్యుంజయ స్వామి వారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారి గజమాలతో అలంకరించి కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లోనే తన ఆరో సెంచరీని సాధించాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ధోనీ కంటే పంత్ బెటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వీటిపై తాజాగా దినేశ్ కార్తిక్ స్పందించారు. వారిద్దరిని పోల్చడం సరైంది కాదని.. ఇంకాస్త సమయం ఇవ్వాల...
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లోనే తన ఆరో సెంచరీని సాధించాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ధోనీ కంటే పంత్ బెటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వీటిపై తాజాగా దినేశ్ కార్తీక్ స్పందించారు. వారిద్దరిని పోల్చడం సరైంది కాదని.. ఇంకాస్త సమయం ఇవ్వాల...
SRD: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయు జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఏఐటీయూసీజిల్లా కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.
కడప: పట్టణంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఈనెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా 136వ సదస్సు జరుగుతుందని సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం సంచాలకులు ఆచార్య జీ పార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో ‘జోస్యం జనార్ధన శాస్త్రి జీవితం – సాహిత్యం’ అనే అంశంపై విశ్రాంత తెలుగు పండితులు విద్వాన్ కందిమల్ల రాజారెడ్డి ప్రసంగించనున్నారు.
KMR: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న జిల్లా స్థాయి యువజన పోటీలు ఉదయం10 గంటల నుంచి కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి జగన్నాథం తెలిపారు. పూర్తి వివరాలకు కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి రూమ్ నంబర్ 223ను సంప్రదించాలని జిల్లా యువజన క్రీడల అధికారి వివరించారు.
NLG: పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయటం పట్ల చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సోమవారం అంబేద్కర్ మెమోరియల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బుస్సు మధుసూదన్, దుబ్బ విగ్నేష్ పాల్గొన్నారు.
NZB: బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఈ నెల 25న జోనల్ స్థాయి ఎస్జీఎఫ్ ఖోఖో అండర్-14, 17 బాలుర, బాలికల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు క్రీడా పోటీల ఇన్‌ఛార్జి ప్రేమ్ తెలిపారు. బాన్సువాడ, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
GNTR: ఉండవల్లిలోని నివాసంలో సోమవారం మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు.. మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. రెండు కిడ్నీలు పాడైపోయిన తనకు డయాసిస్ కోసం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన సంగ నాగేంద్రబాబు కోరారు. ఆయన తప్పకుండా సాయం చేస్తాం అని హామీ ఇచ్చారు.