ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని ఉభయ ఆలయాల్లో ఉన్న హుండీల లెక్కింపు రూ.10,68797 కాగా ఈ మొత్తం కూడా 4 నెలల 13రోజులు కాలంలో వచ్చిన ఆదాయమని తెలిపారు.
మెయిన్ బోర్డు కేటగిరిలో IPOకు వచ్చిన మన్బా ఫైనాన్స్ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ క్షణాల్లోనే పూర్తయింది. ఇవాళ ఉదయం సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కాగా.. కొన్ని నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. IPOలో భాగంగా రూ.151 కోట్ల సమీకరణకు 1.26 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి పెట్టింది. ధరల శ్రేణిని రూ.114-120గా నిర్ణయించింది. కనీసం 125 ఈక్విటీ షేర్లకు సబ్‌స్క్రైబ్ చేసుకో...
KNR: తిరుమల తిరుపతిలో లడ్డూ కల్తీ జరగడం అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమలలో లడ్డూ కల్తీ కావడం, దీనికి సంబంధించిన అపచారంలో బీజేపీకి భాగస్వామ్యం ఉన్నట్టేనా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయని ఆరోపించారు.
KNR: మానకొండూర్ మండల కేంద్రంలో సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారాక్ చెక్కులను మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
KMR: కామారెడ్డి రాజీవ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఉప వైద్యాధికారి డాక్టర్ ప్రభు కిరణ్ సందర్శించారు. ల్యాబ్, వ్యాక్సినేషన్ తదితర రూములను, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రోగులకు అందుతున్న సేవల గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి ఈశ్వరిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సీహెచ్ఓ రుక్మిణి, వైద్య సిబ్బంది భీం, గణేష్, వెంకటరమణ తదితరులు ఉన్నారు.
VZM: చీపురుపల్లి డీఎస్పీగా ఎస్.రాఘవులు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతక ముందు డీఎస్పీగా విధులు నిర్వహించిన ఏ.ఎస్.చక్రవర్తి మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు కృషి చేస్తానని తెలిపారు. గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపడతానన్నారు.
MHBD: తొర్రురు మండలం గుర్తురు గ్రామ క్రాస్ వద్ద తొర్రురు పీఏసీఎస్ వారి ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ పంపుని ముఖ్య అతిథిగా విచ్చేసి పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఎంఎల్ఏ స్వయంగా పెట్రోల్ వాహనాలకు నింపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఝాన్సి రెడ్డి , ప్రసాద్ పాల్గొన్నారు.
SRCL: గంభీరావుపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీ డబుల్ బెడ్ రూంలలో గత పది రోజుల నుండి తాగునీరు రావడం లేదంటూ మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు కాలనీవాసులు ధర్నాకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చేరుకొని రెండు రోజులలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
KDP: మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామ పంచాయితిలో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ… టీడీపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలుపుతూ…సంక్షోభంలోను ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఎమ్యెల్యేల జీతాలు, వారి సౌకర్యాలు కట్ చేయాలని పిటిషన్‌లో కోరారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
MNCL: దేశంలో కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంపదలో వాటా అందించాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లుగా అధికారంలో ఉన్న పాలకులు అణగారిన వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు బహుజనుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
KRNL: జిల్లా నుంచి జాతీయ అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించే క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. సోమవారం కర్నూలులోని కలెక్టరేట్ కార్యాలయంలో పవర్ లిఫ్టింగ్‌లో నేపాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన రేష్మను కలెక్టర్ సన్మానించారు.
GNTR: గుంటూరు నగరం వెస్ట్ తహశీల్దార్‌గా కె. వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2013 బ్యాచ్‌కి చెందిన ఆయన డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తూ 2019లో పదోన్నతి పొందారు. అనంతరం ప్రకాశం జిల్లా దర్శి, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మార్వోగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు వెస్ట్‌కు వచ్చారు.
అన్నమయ్య: ఈనెల 28న భగత్ సింగ్ జయంతి వేడుకలు విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల నందు పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. అతిపిన్న వయసులోనే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవకారుడు స్వాతంత్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్ సింగ్ అని అన్నారు.
SRCL: వేములవాడ పట్టణంలో మడేలేశ్వర అలయ సమీపంలో రజక సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం భూమి పూజ చేసారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సంఘ భవనాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఇక్కడ రజక సంఘ నాయకులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.