• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సమైక్య రాష్ట్రాల స్ఫూర్తికి జమిలి ఎన్నికలు పూర్తి వ్యతిరేకం’

భద్రాద్రి: బీజేపీ ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలు అనే విధానం భారత దేశ ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు లాంటిదని సీపీఎం జిల్లా కార్యదర్శి కే బ్రహ్మచారి అన్నారు. సోమవారం చర్ల మండలం గాంధీ సెంటర్‌లో జరిగిన గ్రామ శాఖలో మాట్లాడారు. భారత రాజ్యాంగ స్పూర్తికి, సమైక్య రాష్ట్రాల స్ఫూర్తికి జమిలి ఎన్నికలు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు.

September 23, 2024 / 03:48 PM IST

‘నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి’

KDP: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. కడపలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన ఫిర్యాదులను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

September 23, 2024 / 03:47 PM IST

అంబులెన్సుకు ప్రమాదం

పెద్దపల్లి: ప్రమాదాలకు గురైన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లే అంబులెన్స్‌ పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద బోల్తాపడింది. పట్టణంలోని శాంతినగర్‌ నుంచి వస్తున్న అంబులెన్సును బోలెరో వాహనం ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ ధోని చేతికి గాయమైంది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

September 23, 2024 / 03:46 PM IST

S.V.పురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

చిత్తూరు: వడమాల పేట మండలం S.V.పురం పంచాయతీలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ స్టిక్కర్ అంటించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి హేమావతి, శేషాద్రి యాదవ్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

September 23, 2024 / 03:45 PM IST

ద్విచక్ర వాహనాల వేలం

SRD: పటాన్‌చెరు అబ్కారీ స్టేషన్‌లో ఈనెల 25న ఉదయం 11 గంటలకు ద్విచక్ర వాహనాల వేలంపాట ఉంటుందని ఎక్సైజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. వివిధ గంజాయి కేసుల్లో పట్టుబడిన ఆరు ద్విచక్ర వాహనాలను మెదక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో, జిల్లా మద్య నిషేద, అబ్కారీ అధికారి సమక్షంలో పటాన్‌చెరు స్టేషన్ ఆవరణలో వేలం వేస్తున్నట్లు తెలిపారు.

September 23, 2024 / 03:45 PM IST

సిల్వర్ జూబ్లీలోకి.. ‘పాడుతా తీయగా’

తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా’ సింగింగ్ షోకి సపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. ఈ ప్రోగ్రాం త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనుంది. ఇప్పటికే 23 సీజన్లు పూర్తి చేసుకొని 24వ సీజన్‌లోని అడుగుపెట్టనుంది. తెలుగులో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోనున్న ఫస్ట్ టీవీ షోగా ‘పాడుతా తీయగా’ నిలవనుంది. 1996 నుంచి 2020 వరకు దీనికి దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మ...

September 23, 2024 / 03:45 PM IST

భవిష్యత్తు పట్ల భరోసా పెరిగింది: ఎమ్మెల్యే

SKLM: భవిష్యత్ పట్ల ప్రజలకు భరోసా ఏర్పడేలా ప్రభుత్వం పని చేస్తోంది, పేదల ఇళ్లల్లో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలనందుతోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలంలోని బలరాంపురంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

September 23, 2024 / 03:44 PM IST

నూతన తహసీల్దార్‌కు సన్మానం

MDK: రేగోడు మండల కేంద్రానికి ఇటీవల నూతనంగా తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన నరేష్‌ను సోమవారం చౌదర్ పల్లి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవేందర్, మంద విఠల్, వెంకటేశం గౌడ్, మంద రాములు, పెంటయ్య, రాములు పాల్గొన్నారు.

September 23, 2024 / 03:44 PM IST

‘వంద రోజులలో ప్రతి ఇంటికి మేలు జరిగింది’

KDP: కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో ప్రతి ఇంటికి మేలు చేకూరిందని ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కడప నగరంలోని అశోక్ నగర్, రామకృష్ణ కాలనీ నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి అధికారంలోకి రాగానే మూతపడిన అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. TDP జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

September 23, 2024 / 03:43 PM IST

‘సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే’

HYD: మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ కల్పిస్తున్నామని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ అబ్దుల్లా అన్నారు. సోమవారం మలక్పేట పరిధిలో సలార్-ఈ-మిల్లత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సర్టిఫికెట్లు అందజేశారు. ఉచిత శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

September 23, 2024 / 03:43 PM IST

చెవిటి దినోత్సవం సందర్భంగా అవగాహన

SRCL: అంతర్జాతీయ డేప్ డే వారోత్సవాల్లో భాగంగా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినికిడి సమస్య లేదా చెవికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు సమీప ఆశ వర్కర్లను, వైద్యులను సంప్రదించాలని తెలిపారు. చెవిలో పుల్లలు పెట్టడం కానీ, నీరు, నూనె లాంటి పదార్థాలను వేయరాదని సూచించారు. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ వెంకటేష్, ఆశ వర్కర్లు తదితరులు ఉన్నారు.

September 23, 2024 / 03:41 PM IST

‘గొట్టిపాటి లక్ష్మిని కలసిన టీడీపీ నేతలు’

ప్రకాశం: దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ మరియు యువ నాయకులు డా.కడియాల లలిత్ సాగర్‌ని దర్శిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, దర్శి మాజీ శాసనసభ్యులు నారపసెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ ఛైర్మన్ పిచ్చయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.

September 23, 2024 / 03:41 PM IST

అండర్-14 బాలురు, బాలికలు ఖోఖో క్రీడాకారుల ఎంపికలు

KMR: కామారెడ్డి మండలంలోని గర్గుల్‌లో అండర్ -14 బాలురు, బాలికలు ఖోఖో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు బ్రహ్మం, ఫిజికల్ డైరెక్టర్ నోముల మధుసూదన్ రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ హీరలాల్ ఆధ్వర్యంలో ఎంపిక చేపట్టారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు ప్రబులింగం, దయాకర్, బాబాగౌడ్, నవీన్ పాల్గొన్నారు.

September 23, 2024 / 03:41 PM IST

‘అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కారం చేయండి’

ASR: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించి, బాధితులకు తగిన న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. పాడేరులోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా విజిలెన్స్ మరియు మోనటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు పరిహారం అందించడంలో జాప్యం చేయకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

September 23, 2024 / 03:40 PM IST

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

ప్రకాశం: అద్దంకి మండలం అద్దంకి పట్టణ, పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిని అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణయ్య సోమవారం తెలియజేశారు. ఇతనిని కొంగపాడు డొంక వద్ద ఎస్సై ఖాదర్ బాషా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ముద్దాయి పెర్నమిట్టకు చెందిన తన్నీరు మధుబాబుగా సీఐ కృష్ణయ్య తెలిపారు. అతని దగ్గర నుంచి 3,41,500 రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

September 23, 2024 / 03:39 PM IST