KMM: బయ్యారం మండలం నామలపాడు వద్ద ఉన్న ఏకలవ్య మోడల్ పాఠశాలను సోమవారం ఎంపీ బలరాం నాయక్ సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఎంపీ తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పాఠశాలలో అన్ని వసతులు కల్పించాలని అధికారులను సూచించారు. అదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారు.
KMR: కామారెడ్డిలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని బాంబే క్లాత్ హౌస్ షోరూం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. షో రూమ్‌ను ప్రారంభించి అభిమానులతో సందడి చేశారు. బ్రహ్మానందం ఆనందంతో సెల్ఫీలు తీయడానికి అభిమానులు పోటీపడ్డారు.
AP: వైసీీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఏ మతమో.. ఏ కులమో చెప్పాలని రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడికి టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు ఎలా అప్పగించారని మండిపడ్డారు. జగన్ దేవుడిని మోసం చేశాడు.. భక్తులనూ మోసం చేశాడని ఎద్దేవా చేశారు. లడ్డూ కల్తీపై జగన్ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో హిందూ ఆలయాలు ధ్వంసం చేశారని, తిరుమల శాంతి, పవిత్రతను దెబ్బతీశారని ఆగ్ర...
TG: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. ఘటన వివరాలను, సునీతా లక్ష్మారెడ్డి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై కేసులు నమోదు చేసి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతా లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని కాంగ్రెస్ గుర్తించా...
కోనసీమ: అంబేడ్కర్ ఫ్లెక్సీ చింపి, అగౌరవ పరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరంలో మాలమహానాడు ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ప్రధాన రహదారిపై ర్యాలీ చేసి, రోడ్డుపై రఘురామ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఆయనపై ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
NRML: ఉట్నూరు పట్టణంలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలకు బి++ గ్రేడ్ ర్యాంకు రావడం అభినందనీయమని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా అన్నారు. ఇటీవల న్యాక్ బృందం సభ్యులు ఆ కళాశాలను సందర్శించి ర్యాంకును కేటాయించారు. ఆ కళాశాల ప్రిన్సిపల్ హరిత ఆధ్వర్యంలో అధ్యాపకులు ఉట్నూరులో పీఓను కలిసి ధ్రువీకరణ పత్రాన్ని చూపించారు.
KMM: కుటుంబ కలహాలతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ముదిగొండ మండలంలో చోటుచేసుకుంది. బాణాపురం గ్రామానికి చెందిన బాణాల శ్రీనివాస్ (24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ASR: జలతరంగిణిలో లభ్యమైన రెండు మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో MLA శిరీషదేవి సోమవారం ఆసుపత్రిని సందర్శించారు. ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు ఇటువంటి దురదృష్టకరమైన ఘటనలు ఏజెన్సీలో జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.
VKB: స్వదేశీ అభియాన్ పథకం కింద రూ.99 కోట్లతో వికారాబాద్ అనంతగిరి కొండలను అభివృద్ధి చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనిలో మొదటి దశలో రూ.38 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. శంకర్పల్లి, మర్పల్లి రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.400 కోట్లు నిధులు మంజూరు చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని అడుగుతానని తెలియజేశారు.
తూ.గో: సామాజిక సేవా కార్యక్రమాలకు ఓఎన్జీసీ ప్రాధాన్యం ఇస్తుందని అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జెడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు పేర్కొన్నారు. మామిడికుదురు పాశర్లపూడిలంకలో సోమవారం ఓఎన్జీసీసీఎస్ఆర్ నిధులు రూ.13.70 లక్షలు వ్యయంతో కొనుగోలు చేసిన 199 సైకిళ్లు, నాలుగు బీరువాలను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్ రావు పాల్గొన్నారు.
HYD: గాంధీ ఆసుపత్రి ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ ఆసుపత్రిలో మాతా, శిశు మరణాలు పెరిగాయని ఇటీవల బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురు సభ్యులతో నిజానిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈరోజు BRS నేతలు గాంధీకి వస్తారన్న సమాచారంతో పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు.
TG: దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లోని నిర్వాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ చెరువు పరిధిలోని కూల్చివేతలపై కోర్టు స్టే ఇచ్చింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై చెరువు నిర్వాసితులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 4 నుంచి 6వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింద...
AP: పింఛన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉన్నారని అధికారులు గుర్తించారు. అలాగే అన్నీ అర్హతలు ఉన్న పింఛన్లు రానివారు కూడా ఉన్నారని తెలిపారు. దీంతో అర్హులు, అనర్హులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. అలాగే కొత్త పింఛన్ల విధివిధానాలపై రూపకల్పనకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
NRML: తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం వెంటనే లడ్డు అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు.
KDP: ఓబులవారి పల్లి మండలం కాకర్ల వారి పల్లిలో 7 కోట్ల 52 లక్షలు రూపాయలతో కిలోమీటర్ సిమెంట్ రోడ్డు, తుమ్మకొండ నుండి చిన్న ఓరంపాడుకు 9 కిలోమీటర్ల తారురోడ్డుకు సోమవారం రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలకు మౌలిక వసతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.