AP: వైసీీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఏ మతమో.. ఏ కులమో చెప్పాలని రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడికి టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు ఎలా అప్పగించారని మండిపడ్డారు. జగన్ దేవుడిని మోసం చేశాడు.. భక్తులనూ మోసం చేశాడని ఎద్దేవా చేశారు. లడ్డూ కల్తీపై జగన్ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో హిందూ ఆలయాలు ధ్వంసం చేశారని, తిరుమల శాంతి, పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.