శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో.. రితేష్ రాణా దర్శకత్వం వహించిన మత్తువదలరా-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. కేవలం 10 రోజుల్లోనే రూ.30.01కోట్లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే అమెరికాలోనూ 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ దాటేసినట్లు తెలిపారు. కాగా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది.