TG: హైదరాబాద్లోని దుర్గం చెరువు FTL నిర్ధరణ శాస్త్రీయంగా జరగలేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులొ విచారణ జరిగింది. ఈ క్రమంలో బాధితుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వారంలోపు చెరువుల పరిరక్షణ కమిటీ ముందు హాజరై అభ్యంతరాలను చెప్పాలను బాధితులకు సూచించింది. 6 వారాల్లోపు FTL పరిధిని నిర్ధరించాలని.. అప్పటివరకు అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ఆదేశించింది.