రుణ భారంతో ఇబ్బంది పడుతున్న స్పైస్ జెట్‌కు NCLT మరోసారి నోటీసులు పంపించింది. ఆ సంస్థ ఆపరేషనల్ క్రెడిటార్లలో ఒకటైన టెక్ జాకీ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా NCLT ఈ నిర్ణయం తీసుకుంది. తమ నుంచి స్పైస్ జెట్ సంస్థ రూ.1.2 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను వాడుకుందని టెక్ జాకీ సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను మహింద్ర ఖండేల్ వాలా, సంజీవ్ తంజాన్‌తో కూడిన బెంచి పరిశీలించింది. విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.