లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, జానీ మాస్టర్‌ను కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు.