యూపీలోని కాన్పూర్లో ఇజ్రాయెల్ యంత్రంతో ఆక్సిజన్ థెరఫీ చేసి 60 ఏళ్ల వృద్ధులను 25 ఏళ్ల యువకులుగా మారుస్తామని రాజీవ్ దూబే, రష్మీ దూబే ప్రజలను నమ్మించారు. సాకేత్ నగర్లో రివైవల్ వరల్డ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. కొంతమందికి థెరపీ కూడా చేశారు. కానీ, చికిత్స కారణంగా ఎవరూ లాభపడకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ థెరపీ కోసం ప్రజల నుంచి రూ.35 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది.