పోలీసులపై దుండగులు దాడి చేసిన ఘటన బిహార్లో జరిగింది. అరారియా జిల్లాలోని ఓ భూవివాదం కేసులో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. ఈ క్రమంలో దుండగులు బాణాలతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ బాణం ఓ మహిళా ఎస్సై తలలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అధికారిణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.