ఛత్తీస్‌గఢ్ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని జోరటరాయ్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపడి నలుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని కోరారు.