AP: లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా పుష్కరిణీలో స్నానం చేసి మాడవీధుల్లో ఆయన ప్రదిక్షణ చేశారు. అనంతరం అఖిలాండం దగ్గర స్వామి వారికి హారతి ఇచ్చి ప్రమాణం చేసేందుకు బయలుదేరారు. అయితే పోలీసులు భూమనను బలవంతంగా అదుపులోకి తీసుకుని తిరుమల నుంచి తిరుపతికి తరలించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన తెలిపారు.