TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. దళితబంధు హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయలేదని విమర్శించారు. రూ.2లక్షల రుణమాఫీ ఎంతమందికి చేశారని ప్రశ్నించారు. రైతుబంధు, రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు.