రాంచీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంటికి సమీపంలోని ఓ బావిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మహిళ భర్త సునిల్ బార్లా తెలిపాడు. ఆ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులపై కూడా తేనెటీగలు దాడి చేశాయని, వారు వెంటనే అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నాడు.