బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరూ దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలకు ఐశ్వర్య రాయ్ చెక్ పెట్టింది. ఆమె తమ వెడ్డింగ్ రింగ్ ధరించి ‘పారిస్ ఫ్యాషన్ వీక్’లో పాల్గొంది. దీంతో తాము విడాకులు తీసుకోబోతున్నామంటూ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లైంది.