చిన్న టీ కొట్టు దగ్గర నుంచి రూ.లక్షల్లో చెల్లింపుల వరకు ఆర్థిక లావాదేవీలకు అత్యధికంగా యూపీఐ పద్ధతినే వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో UPI లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై లోకల్ సర్కిల్స్ అనే సంస్థ 42,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 75 శాతం మంది ప్రజలు ఛార్జీలు విధిస్తే UPIని వినియోగించడం ఆపేస్తామని తేల్చేచెప్పారు. 25 శాతం రుసుము విధించినా ఫర్వాలేదని పేర్కొన్నారు.