AP: బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ కేసు రిమాండ్ రిపోర్టులో నిందితులుగా IPS అధికారుల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో ఏ1గా YCP నేత కుక్కల విద్యాసాగర్, ఏ2గా మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఏ3గా మాజీ విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, ఏ4గా మాజీ వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా మాజీ విజయవాడ డీసీపీ విశాల్ గున్నీని పేర్కొన్నారు. విద్యాసాగర్‌తో ఈ అధికారులు కుమ్మకయ్యారని వెల్లడించారు.