AP: తిరుమల నెయ్యి వివాదంపై జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐ ద్వారా విచారణ జరిపించాలన్నారు. ‘కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి తయారీకి రూ.1500-2100 ఖర్చవుతుంది. దీనికంటే తక్కువ రేటుకు వచ్చే ఏ నెయ్యిలోనైనా కూరగాయల/జంతువుల కొవ్వులు కలుపుతారు. ఆలయాల్లో గోశాలలు ఏర్పాటు చేస్తే స్వచ్ఛమైన నెయ్యి పొందవచ్చు’ అని ట్వీట్లో పేర్కొన్నారు.