ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జంగ్ ఉన్ మరోసారి క్రూర నిర్ణయం తీసుకున్నారు. కొరియాకు చెందిన రీ (39), కాంగ్ (43) చైనాలో ఉంటున్నారు. చైనాలోని ఉత్తర కొరియా వాసులను రహస్యంగా దక్షిణ కొరియాకు పారిపోయేందుకు వీరిద్దరూ సహకరిస్తున్నట్లు కిమ్ దృష్టికి వచ్చింది. దీంతో వారిని కొరియాకు తీసుకొచ్చి విచారించారు. విచారణ అనంతరం ఆ ఇద్దరు మహిళలను ఉరి తీశారు. ఇక ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది మహిళలకు జీవిత ఖైదు విధించారు.