KDP: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. కడపలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన ఫిర్యాదులను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.