TG: మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. మాదాపూర్‌లో నిర్వహించిన ట్రవెర్నియా ఫెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా మంత్రి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పర్యాటకులతో పాటు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు తెలంగాణకు వచ్చే వారిని పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు అనేక పథకాలు చేపడుతున్నామని చెప్పారు.