AP: అమరావతి రాజధానిలో భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. రాజధానిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేయనున్నారు.