AP: వ్యవసాయంపై ఆధారపడిన దానిలో గోదావరి, పెన్నా ముఖ్యమైన ప్రాజెక్టులని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై మాట్లాడామని చెప్పారు. ఆర్థిక రంగంలో జరిగే మార్పులపై విదేశాంగశాఖ మంత్రితో సీఎం చర్చించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని వివరించారు.