AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబురాలు అంబరాన్నంటాయి. పౌర్ణమి ప్రదోషకాలంలో ఆలయ ప్రధాన వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం నిర్వహించారు. నూలువత్తులను ఆవునెయ్యితో తడిపి ఎత్తైన స్తంభాలపై వేలాడించి దీప ప్రజ్వలన చేశారు. త్రిపురాసురుణ్ని సంహరించిన తర్వాత పరమేశ్వరుడికి దృష్టి దోష పరిహారం కోసం, విజేయుడైన శుభవేళలో పార్వతీ దేవి తొలుతగా జ్వాలాతోరణం జరిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి.