శ్రీలంక పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేకు ప్రజలు జైకొట్టారు. ఆయన పార్టీ నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) పార్టీకే మూడింట రెండువంతుల సీట్లు కట్టబెట్టారు. దీంతో 225 సీట్లున్న పార్లమెంటులో ఎన్పీపీ 159 స్థానాలు గెలుచుకుందని ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా, ప్రతిపక్షంలోని యునైటెడ్ పీపుల్స్ పవర్ పార్టీ 40 సీట్లకు పరిమితమై రేసులో రెండో స్థానంలో నిలిచింది.