TG: వరి ధాన్యం, పత్తి పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన మంత్రి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. భైంసా పట్టణంలోని జిన్నింగ్ మిల్ను సందర్శించి, పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు నష్టపోకుండా అధిక లాభాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.