ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’ మళ్లీ పెళ్లి పీటలెక్కనున్నారు. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో తన ప్రేయసి ‘లారెన్ శాంచెజ్’ను డిసెంబర్ 25న వివాహం చేసుకోనున్నారు. 2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్లో ఉన్నట్లు.. 2019లో విషయం బయటకు వచ్చింది. అలాగే, 2023 మేలో వారి నిశ్చితార్థం జరిగినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆమెకు సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం.