ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 33 మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో కానిస్టేబుళ్ల బదిలీల్లో కొందరికి నిర్దేశిత కాల పరిమితి పూర్తయిన వారు ఉన్నారు. ఆయా పోలీస్ స్టేషనల్లో పనిచేస్తూ బదిలీ అయిన వారిని రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.