TG: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆధ్వర్యంలో నగరంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్ ఎదుట ఉన్న చెప్పుల దుకాణాన్ని కూల్చివేయడానికి అధికారులు సిద్దమయ్యారు. ఆ దుకాణానికి చెందిన తల్లీకొడుకులు తమ షాపు కూల్చివేస్తే ఎలా బతకాలంటూ అధికారులను నిలదీశారు. ‘కేసీఆర్ ఎక్కడ ఉన్నావు.. నువ్వు రావాలి’ అంటూ కంటతడి పెట్టుకు...
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ – ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ మరియు సీడప్ – ఆధ్వర్యంలో సెప్టెంబరు 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నందు 20 కంపెనీలతో జరగబోవు “మెగా జాబ్ మేళా” వాల్ పోస్టర్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో MLA ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ పాల్గొన్నారు.
NDL: బేతంచెర్ల మండల పరిధిలోని గోరుమనుకొండ మోడల్ స్కూల్ విద్యార్థులు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డోన్ నుండి ఆర్. కొత్తపల్లె, ఆర్ ఎస్ రంగాపురం బేతంచెర్ల తదితర గ్రామల విద్యార్థులను గోరుమనుకొండ మోడల్ స్కూల్‌కు, గోరుమనుకొండ గ్రామ ప్రజలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా తెనాలిలో సోమవారం నిర్వహించిన మహాయాగంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి నిజాయతీగా పని చేసే వారినే నియమిస్తామన్నారు.
TG: రైతుబంధు, రైతు రుణమాఫీ అమలు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలను రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్న ప్రభుత్వం.. ఎంతమందికీ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే దళిత బంధు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో రెండవ విడత నగదును వెంటనే విడుదల చేయ...
ప్రకాశం: వాయుగుండం నేపథ్యంలో వర్షం పడుతున్నందున అద్దంకి నియోజకవర్గంలో సోమవారం పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ హెచ్చరించింది. వర్షం పడుతున్న సమయంలో ప్రజలు ఎడారి ప్రాంతాలు, చెట్ల కింద ఉండవద్దని ఇండ్లలోనే ఉండాలని తెలియజేసింది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
ELR: రసాయన వ్యవసాయం చేయడం వల్ల రైతులకు పంటపై ఖర్చులు పెరగడమే కాకుండా భూసారం తగ్గిపోతుందని, రసాయనాలతో పండించిన కూరగాయలు పంటలు ఆహారంగా తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డీపీఎం వై.నూకరాజు అన్నారు. సోమవారం మొగల్తూరు మండలం పడమటి పాలెం రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు కిట్లు పంపిణీ చేశారు.
KMM: దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై నిజాయితీగా నిలకడగా పోరాటాలు చేసే సంఘంగా సీఐటీయుకు గుర్తింపు వుందని రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ అన్నారు. సోమవారం ఖమ్మం బైపాస్ రోడ్ పెద్ద కూరగాయల మార్కెట్‌లో జరిగిన నూతన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యాజమాన్యాల ఒత్తిడికి లొంగకుండా కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా సీఐటీయు భావిస్తుందని పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌లో రెండో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మలి దశలో 5 జిల్లాల్లో 26 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, మొదటి దశ ఎన్నికల్లో 24 స్థానాలకు పోలింగ్ జరగగా.. 58.19 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో సైతం ఓటు వేయడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.
కడప: జిల్లాలో మున్సిపల్ కమిషనర్లు బదిలీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మైదుకూరులో పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ కావడంతో వారి స్థానంలో మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాసరెడ్డిని అధికారులు నియమించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మైదుకూరు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ELR: ఏలూరు సిఆర్ఆర్ రెడ్డి మహిళా కళాశాల విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ మరియు సైబర్ క్రైమ్ ఎవేర్నెస్ కార్యక్రమాన్ని సోమవారం పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. విద్యార్థులు ర్యాగింగ్ చేయడం వలన వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. సోషల్ మీడియా ద్వారా జరిగే ఫ్రాడ్లకు విద్యార్థినిలు గురి కాకూడదన్నారు.
VSP: గాజువాక సమీపంలోని అగనంపూడి బ్రహ్మకుమారిస్ దివ్య జ్యోతిభవన్‌లో అగనంపూడిలో మొట్టమొదటిసారిగా 108 మంది పుణ్య దంపతులచే సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సోమవారం నిర్వహించారు. బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ ముఖ్య కేంద్రం మౌంట్అబూ నుంచి విచ్చేసిన ఆధ్యాత్మిక ప్రవచన కర్త రాజయోగి బికే మంజూనాథ్ భాయిజీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథను వినిపించారు.
KMM: ఇటీవల కుషాయిగూడ డిపోకి చెందిన డ్రైవర్ ధారావత్ గణేష్ పై దుండగులు దాడి చేసిన ఘటనపై ఆర్టీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరిరామ్ నాయక్ స్పందించారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం బాధాకరమన్నారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకాడబోమని రీజినల్ మేనేజర్ స్పష్టం చేశారు.
AP: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వచ్చారు. ఇదే సమయంలో బీజేపీ నేత హరీశ్ వర్గీయులు వస్తుండగా కేతిరెడ్డి అనుచరులు వాహనాలు అడ్డుగా పెట్టారు. దీంతో కేతిరెడ్డి డ్రైవర్‌ను బీజేపీ కార్యర్తలు చితకబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుక...
KMM: జిల్లాలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన వివరాలను మంత్రి క్యాంప్ కార్యాలయ ఇంఛార్జ్ దయాకర్ రెడ్డి విడుదల చేశారు. ఉ.10 గంటలకు ఖమ్మం ఒకటో డివిజన్, ఉ.11 గంటలకు 59వ డివిజన్ దానవాయిగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం మ. 12 గంటలకు కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తున్నారు.