• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘లడ్డు కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’

SKLM: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మెలియాపుట్టిలో జనసేన పార్టీ మండల నాయకులు శ్రీ వేణుగోపాలస్వామి స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కల్తీ నెయ్యి ప్రసాదంలో వాడటంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

September 23, 2024 / 05:30 PM IST

చైతన్యం తీసుకొచ్చేందుకు ఇందిరా ఫెలోషిప్

ADB: మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంఛార్జ్, ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ ఆత్రం సుగుణక్క తెలిపారు. సోమవారం మావల మండల కేంద్రంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఫెలోషిప్ మెంబర్స్​కి బూట్ క్యాంప్ వర్క్ నిర్వహించారు.

September 23, 2024 / 05:30 PM IST

జీజీహెచ్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభం

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి గైనకాలజీ ఓపీడీ ఎస్ఆర్ఎంటీ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పీఐఎన్సీసీ ప్రెసిడెంట్ జీన్ టాల్బర్ట్ ఫాకోగ్, లీడ్ ఇండియన్ ఆపరేషన్స్ డా.సమత కడియాలతో కలిసి ప్రారంభించారు. ఈ క్యాన్సర్ శిబిరం ఈనెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజులు పాటు కొనసాగుతుందన్నారు.

September 23, 2024 / 05:29 PM IST

ప్రతి మారుమూల గ్రామానికి సిమెంట్ రోడ్లు

KDP: ప్రతి మారుమూల గ్రామానికి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రామాపురం మండలంలోని బండపల్లి టోల్ ప్లాజా నుంచి శ్రీ మహావిష్ణువు దేవస్థానం వరకు, నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. గతంలో గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నాన ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు.

September 23, 2024 / 05:29 PM IST

రూ.600 కోట్లు వసూళ్లతో ‘స్త్రీ 2’ అరుదైన రికార్డు

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్‌రావ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘స్త్రీ 2’ సినిమా అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకుపైగా వసూళ్లు(నెట్ కలెక్షన్స్) రాబట్టిన తొలి హిందీ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. 39 రోజుల్లో ఈ చిత్రం రూ.604.22 కోట్లు(నెట్) వసూల్ చేసిందని తెలిపింది. రూ.713 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసిందని పేర్కొంది.

September 23, 2024 / 05:27 PM IST

బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

NLG: మునుగోడు మండలం పులిపలుపుల అడ్డరోడ్డు నుండి బీరెల్లిగూడెం వరకు 1.6 కిలోమీటర్లు అంచనా విలువ ఒక కోటి నలభై లక్షల రూపాయలతో మంజూరైన బీటీ రోడ్డుకు సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు దోటి నారాయణ, నన్నూరు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం ఉన్నారు.

September 23, 2024 / 05:26 PM IST

కళ్యాణలక్ష్మి చెక్కు అందించిన ఎమ్మెల్యే

KMM: అన్నపురెడ్డిపల్లి మండలం ఊటుపల్లి గ్రామపంచాయతీకి చెందిన కొప్పెర తిరుపతమ్మకు సోమవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కళ్యాణ లక్ష్మి చెక్కును అందించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మి ఓ వరం అని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

September 23, 2024 / 05:26 PM IST

అక్రమంగా నిల్వ చేసే విక్రయిస్తున్న గుట్కా స్వాధీనం

JN: జనగాం పోలీస్​ స్టేషన్​ పరిధిలో పోలీసులు సోమవారం గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కాను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గమన రామ్ నిలువ చేసిన రూ.8,36,920 విలువగల గుట్కాను సీజ్​ చేసి నిందితుడిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

September 23, 2024 / 05:26 PM IST

దేవుడి కోర్టులో శిక్షలకు జగన్ రెడీగా ఉండాలి: మంత్రి లోకేశ్

AP: న్యాయ స్థానం, దేవుడి కోర్టులో శిక్షలకు జగన్ రెడీగా ఉండాలని మంత్రి లోకేశ్ అన్నారు. శ్రీవారి జోలికి వెళ్లారు.. చేయకూడని పనులన్నీ జగన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజాకోర్టులో జగన్‌కు శిక్ష పడిందన్నారు. కమీషన్ల కక్కుర్తితో శ్రీవారి సన్నిధిలో కల్తీ పనులు చేశారని పేర్కొన్నారు. అడ్డంగా దొరికేసరికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

September 23, 2024 / 05:24 PM IST

మైనార్టీల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

NLR: మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. వాకాడులో షాదీ మంజిల్ కమిటీ సభ్యులు సోమవారం టీడీపీ సీనియర్ నాయకులు విజయ శేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని మర్యాద పూర్వకంగా కలిశారు. షాదీ మంజల్ కమిటీ ఛైర్మన్ అమీర్, వైస్ ఛైర్మన్ బషీర్, రహంతుల్లా, బాబు, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.

September 23, 2024 / 05:24 PM IST

ప్రజా సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే నల్లారి

అన్నమయ్య: గుర్రంకొండ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి హాజరై కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

September 23, 2024 / 05:23 PM IST

పండమేరు వాగును పరిశీలించిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడు నియోజకవర్గకేంద్రానికి సమీపంలోని పండమేరు వాగును సోమవారం ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. అనంతపురం వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురి అయ్యి నగరంలోకి వచ్చి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని ప్రజలు విన్నవించినట్లు తెలిపారు. రోడ్డును పరిశీలించి తాత్కాలికంగా రోడ్డు నిర్మిస్తామని తెలిపారు.

September 23, 2024 / 05:23 PM IST

అభివృద్ధి కోసం మంత్రి సితక్ కు ప్రతిపాదనలు

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి సితక్కకు ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు 244 కోట్ల రూపాయల నిధులు కోరుతూ ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రతిపాదనలు అందించి నియోజకవర్గ అభివృద్ధి కోసం అంగన్వాడీ నిధులు మంజూరు, నూతన గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.

September 23, 2024 / 05:22 PM IST

‘పడాల అరుణను పరామర్శించిన జనసేన నాయకులు’

VZM: గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పడాల అరుణ కుమారుడు శరత్ అనారోగ్య కారణాలతో ఆదివారం మృతి చెందడం తెలిసిందే. ఈ మేరకు ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు ఒబ్బిన సన్యాసినాయుడు సోమవారం పడాల అరుణను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఓదార్చారు. శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఇందులో జనసేన నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

September 23, 2024 / 05:21 PM IST

మహిళా ఎస్సై తలలోకి దూసుకెళ్లిన బాణం

పోలీసులపై దుండగులు దాడి చేసిన ఘటన బిహార్‌లో జరిగింది. అరారియా జిల్లాలోని  ఓ భూవివాదం కేసులో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. ఈ క్రమంలో దుండగులు బాణాలతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ బాణం ఓ మహిళా ఎస్సై తలలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అధికారిణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

September 23, 2024 / 05:21 PM IST