JN: తరిగొప్పులకు చెందిన శ్రీలత ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బైకాని బాలరాజు సోమవారం వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అందించారు. వారి వెంట కత్తుల సాయి రెడ్డి, ఎండి యాకుబ్, కొయ్యడ రాజు గౌడ్, బత్తుల వెంకటేష్, నాగపురి సదానందం తదితరులున్నారు.
NRML: తానూర్ మండలంలోని మసల్గా గ్రామానికి చెందిన గాయక్వాడ్ మమత రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. మమత నిరుపేద కుటుంబం జాతీయస్థాయి పోటీలకు వెళ్లడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో పత్రిక ముఖంగా సాయం చేయాలని కోరగా సోమవారం బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తనవంతుగా రూ 5 వేల ఆర్థిక సహాయం సోమవారం అందించారు.
భద్రాద్రి: ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలో 5వ విడత స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు మణుగూరు ఐటీఐ ప్రిన్సిపాల్ జిల్లా కన్వీనర్ బడుగు ప్రభాకర్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐలో పలు కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.
KRNL: ఆదోని డివిజన్ పరిధిలో కొన్ని మండలాల్లో సోమవారం ఓ మోస్తరు వర్షపాతం నమోదు అయింది. గోనెగండ్లలో 49.2 మి. మీ, మంత్రాలయంలో 7.8మి. మీ, ఆదోనిలో 4.6మి. మీ, ఎమ్మిగనూరులో 3.4మి. మీ, పెద్దకడబూరులో 2.4మి. మీ సబ్ కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశం మేఘావృతమవడంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది.
MLG: జిల్లా పోస్ట్ ఆఫీస్‌లో ఆధార్ సేవలు పున:ప్రారంభించినట్లు ములుగు పోస్టల్ ఇన్‌స్పెక్టర్ దయానంద్ తెలిపారు. ములుగు జిల్లా ప్రజలు కొత్త ఆధార్, ఆధార్ కార్డులో అడ్రస్ తప్పులు, బయోమెట్రిక్ మొదలైన సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ హనుమంత్ తెలిపారు.
NLR: నాయుడుపేట మున్సిపల్ కమిషనర్‌గా షేక్ ఫజులుల్లాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం జనార్ధన్ రెడ్డిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేయడంతో ఆయన స్థానంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న షేక్ ఫజులుల్లాను బదిలీ చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం పర్యటన వివరాలను వాడపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. ఉదయం 9 గంటలకు కొమరాజులంక గ్రామంలోని కాపుకళ్యాణ మండపం వద్ద నిర్వహించే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక బ్యారేజ్ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారని తెలిపారు.
కృష్ణా: గుడివాడ నెహ్రూ సెంటర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ.. రఘురామ కృష్ణంరాజు మేకతోలు కప్పుకున్న ఉన్మాది అని, ఒక్క శాతం ఓటు హక్కు కలిగిన రఘురామకృష్ణం రాజు దళితుల మనోభావాలను దెబ్బతీస్తూ.. అంబేడ్కర్ బ్యానర్‌ను తొలగించడం దారుణమని అన్నారు.
NLR: వెంకటగిరి పట్టణంలోని కలివేలమ్మ తల్లి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వెంకటగిరి నియోజకవర్గ జనసేన నేత తోట కృష్ణయ్య ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా వెంకటగిరిలో 3 రోజులపాటు దీక్ష నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు త్వరలో చెల్లిస్తామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాకు మంచినీటి సహాయకుల నియామకం జరగనుందన్నారు. బోర్లు, పైపులు దెబ్బతింటే అదే రోజు మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
HNK: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులపై నమోదైన కోడ్ ఉల్లంఘన కేసును హనుమకొండ పీసీఆర్ కోర్టు సోమవారం కొట్టేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రహీం, శ్రీను, రంజిత్, స్వామి, సుధాకర్‌పై ఎన్నికల ప్రవర్తన, నియమావళిని ఉల్లంఘిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్లో ప్రచారం చేశారనే ఆరోపణలపై హనుమకొండ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
KRNL: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ సంబరాలు చెకుముకి పోటీలను ఈనెల 25వ తేదీన పాఠశాల స్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు శంకరయ్య అలాగే జన విజ్ఞాన వేదిక నాయకులు బి.జీ మాదన్న, ఖాదర్ బాషా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి 8, 9, 10వ తరగతి విద్యార్థులను చెకుముకి పోటీలలో పాల్గొనేటట్లు ప్రోత్సహించాలన్నారు.
KMM: పాలేరు JNTUH ఇంజనీరింగ్ కళాశాలలో వ్యక్తిగత అవగాహన సదస్సును ఏర్పాటు చేసారు. ఈకార్యక్రమంలో డాక్టర్ కే వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ JNTUH ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థుల జీవన ప్రగతికి అవసరమైన ప్రయోజనకరమైన విషయాలపై వ్యక్తిగత అవగాహన కల్పించారు. ప్రస్తుత పోటీప్రపంచాన్ని తట్టుకుని నిలబడాలని విద్యార్థులకు సూచించారు.
SRD: ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను నివారించాలని MPDO సత్తయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్, గ్లాస్ లను పంపిణీ చేశారు. కంగ్టికి చెందిన పూర్వ విద్యార్థులు రవీందర్, గంగాధర్ ప్లేట్లు, గ్లాసులను స్వచ్ఛందంగా అందజేశారు. ప్లాస్టిక్ నివారించే క్రమంలో స్టీల్ వాడకం మంచి ఆలోచన అని MPDO తెలిపారు.
KDP: రాష్ట్రంలో విద్యా రంగంలో ఉన్న సమస్యలు బాగు చేయాలని SFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎద్దు రాహుల్, వీరపోగు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేస్తామని చెప్పి నేడు విద్యారంగాన్ని పటించుకోపోవడం దారుణం అన్నారు