AP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో కేతిరెడ్డి కారును అడ్డుకోబోయిన కూటమి కార్యకర్తను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయారన్నారు. గతంలోచేసిన తప్పులకు కబ్జాలకు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదన్నారు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోన...
MHBD: ఇష్టపడి చదివి మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరీకోవాలని DSP తిరుపతి రావు అన్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లొ సామజిక అంశాలపై విద్యార్థులకు నేడు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, ఎస్ఐ దీపిక, పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
SRD: తిరుమల లడ్డును కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జంగం అర్చక పురోహిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. సదాశివపేటలోని బసవేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయచ్ఛిత్తి హోమ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఆడివయ్య, కోశాధికారి శివప్రసాద్, కార్యవర్గ సభ్యులు శశిధర్, బసవలింగం, నగేష్, శంభు ప్రసాద్, ప్రవీణ్ పాల్గొన్నారు.
మన్యం: మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మన ఇల్లు మన గౌరవం స్వర్ణాంధ్ర తదితర కార్యక్రమాలపై జిల్లా మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం నిర్వహించాలన్నారు.
WGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హ్యాండ్ లూమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టినందుకు గాను టేకుమట్ల మండల చేనేత కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సోమవారం పాలభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.290 కోట్లను తిప్టు పథకం కింద మంజూరు చేయడం సంతోషం అన్నారు.
VZM: డెంకాడ మండలం, రఘుమండ వద్ద VMRDA అభివృద్ది చేసిన NTR స్మార్ట్ టౌన్ షిప్ లేఔట్ లో మిగిలిన 44 MIG ఇళ్ల స్థలాల కోసం కలెక్టరేట్ లో సోమవారం ఈ- లాటరీ ప్రక్రియను నిర్వహించారు. జేసీ S.సేతు మాధవన్, DRO అనిత సమక్షంలో కంప్యూటర్ ద్వారా లాటరీ నిర్వహించారు. విజేతలకు ప్లాటు కేటాయింపు పత్రాలను అందజేసి, జేసీ అభినందించారు.
కృష్ణా: నూజివీడు పట్టణంలోని మండల తహశీల్దార్ కార్యాలయ ఆవరణములో సోమవారం మండలంలోని రేషన్ డీలర్స్, ఎండీయూ ఆపరేటర్లకు సమావేశం నిర్వహించారు. ఇంఛార్జ్ తహశీల్దార్ సుబ్బారావు, పీడీఎస్ డీటీజీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదో తేదీ లోపు రేషన్ పంపిణీ పూర్తి చేయాలన్నారు. వరద సహాయ చర్యల్లో పాల్గొన్న ఎండీయూ వాహన డ్రైవర్లను అభినందించారు.
GNTR: గుంటూరు తూర్పు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీఎస్పీ అజీజ్ తెలిపారు. సోమవారం ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. గంజాయి రవాణా చేసినా విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే రౌడీషీటర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
SRCL: వేములవాడ పట్టణంలో రేపు మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, సెస్ ఎఈ తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల కారణంగా వేములవాడ పట్టణంలోని చెక్కపెల్లి రోడ్, భగవంతరావు నగర్, శ్యామకుంట,టెంపుల్, బద్దిపోచమ్మ ఏరియాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.
ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం ఉదయం 10.30 గంటలకు భీమడోలు మండలం గుండుగొలను పర్యటిస్తారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఇంటింటికి ఎమ్మెల్యే వెళ్లి వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరిస్తారన్నారు.
TG: రాష్ట్రంలో రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తో పాటు సంక్షేమ పథకాలన్నిటికీ ఒకే కార్డ్ ఉండేలా విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. వన్ స్టేట్-వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకెళ్లాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోవాలని.. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబసభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందించాలని అన్నారు. ఫైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్య...
TG: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. మోకాళ్లలోతు నీరు నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో ఇర్కుకుని అవస్థలు పడుతున్నారు. మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కు...
PLD: రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలలో నరసరావుపేటలోని శంకర భారతపురం స్కూల్‌లో చదువుతున్న బి.శ్రావణి (8వ తరగతి ), జి.నాగశ్రీ(9వ తరగతి) రాష్ట స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. రాష్ట ప్రభుత్వం తరపున, వైద్యారోగ్యశాఖలో విభాగమైన ఎయిడ్స్ నియంత్రణ సంస్థ యూత్ ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందడంతో వారిని కలెక్టర్ అరుణ్ అభినందించారు.
WNP: ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. ఐ.డి.ఓ.సి ప్రజావాణి హల్‌లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం మొత్తం 87ఫిర్యాదులు వచ్చాయి.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటంపై నిర్లక్ష్యం వహించరాదన్నారు.
KMM: నేలకొండపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన వెన్నుపూసల సీతారాములు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.