• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బదిలీపై వెళ్తున్న బాన్సువాడ పట్టణ సీఐ కృష్ణ

KMR: బదిలీపై వెళ్తున్న బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణను సోమవారం బీజేపీ నాయకులు సన్మానించారు. తక్కువ కాలంలోనే బాన్సువాడ ప్రజలతో మమేకమయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు శివప్రసాద్, కోణాల గంగారెడ్డి, సాయి కిరణ్, అంజన్న, శంకర్ గౌడ్, భాస్కర్, గుడుగుట్ల అనిల్ కుమార్ పాల్గొన్నారు.

September 23, 2024 / 09:09 PM IST

భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

AP: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదుచేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నోటీసులు ఇచ్చినా.. భూమన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు. అఖిలాండం దగ్గర ప్రమాణం చేయబోయిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా తిరుమల లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం కాదని భూమన తెలిపారు. తన హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రమాణం చేసేందుకు తిరుమల వెళ్లిన...

September 23, 2024 / 09:03 PM IST

‘రేపటి పోలవరం ఎమ్మెల్యే పర్యటన వివరాలు’

ELR: రేపు మంగళవారం పోలవరం మండలంలో స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటిస్తారని క్యాంపు ప్రతినిధులు తెలిపారు. తొలుత మండలంలో కొండ్రు కోట గ్రామంలో ఉదయం 8:30 నుండి 9:30 వరకు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం లక్ష్మీనారాయణ దేవి పేట గ్రామంలో ఉదయం 10.00 గంటల నుండి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంటారన్నారు.

September 23, 2024 / 08:58 PM IST

నూతన టీపీసీసీని కలిసిన గద్వాల కాంగ్రెస్ నాయకులు

GDWL: గాంధీ భవనంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపక్ మున్షీ, నూతన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ల ను కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంఛార్జ్ సరిత తిరుపతయ్య పట్టణ, మండలాల నాయకులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో గద్వాల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై,చర్చలు జరిపారు.

September 23, 2024 / 08:58 PM IST

రేణుకాస్వామి కేసులో నిందితులకు బెయిల్

రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌కు బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా వారిపై హత్యానేరం ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. కాగా ఈ హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులు రాష్ట్రంలోని వివిధ జైళ్లలో రిమాండ్ ...

September 23, 2024 / 08:54 PM IST

‘మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి’

GDWL: జిల్లాలో కల్తీకల్లు, సీహెచ్ తదితర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఎక్సైజ్ సీఐ గణపతి రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామాల్లో కల్తీకల్లు సేవించి ప్రజలు అనారోగ్యానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు.

September 23, 2024 / 08:54 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KMM: అశ్వాపురం మండలం మిట్టగూడెంకి చెందిన పాయం తేజస్విని ఇటీవలే మృతి చెందారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు మృతురాలి స్వగ్రామం మిట్టగూడెం వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

September 23, 2024 / 08:53 PM IST

ఖరీఫ్‌ నుంచి సన్నాలకు రూ.500 బోనస్‌: మంత్రి

HYD: ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో 60.39 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

September 23, 2024 / 08:53 PM IST

‘జిల్లా మొత్తం మీద 15 పిర్యాదులు’

VZM: సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లా మొత్తం మీద 15 పిర్యాదులు వచ్చాయని తెలిపారు. వచ్చిన పిర్యాదులు సత్వర పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిర్యాదు దారుల మీద తీసుకొన్న చర్యలని 15 రోజుల్లో జిల్లా పోలీసు కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.

September 23, 2024 / 08:51 PM IST

‘రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ జరగాలి’

ELR: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేకరించేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జెసి ధాత్రి రెడ్డి అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లా స్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

September 23, 2024 / 08:50 PM IST

ఘనంగా పదవీ విరమణ సన్మానం

SRPT: నడిగూడెం మండలం సిరిపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా 41సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన వెగ్గళం దుర్గాప్రసాద్ ఉద్యోగరీత్యా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సోమవారం కోదాడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వారి సేవలను కొనియాడుతూ వారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

September 23, 2024 / 08:49 PM IST

లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి: శ్రీనివాస్

BHPL: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మొగుళ్ళపల్లి మండల పారా లీగల్ వాలంటీర్ మంగళపల్లి శ్రీనివాస్ మండలంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన జరిగే మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయాలన్నారు. రాజీ పడదగిన కేసులు, సివిల్, క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు.

September 23, 2024 / 08:48 PM IST

వారిని అరెస్టు చేయాలి: ఎమ్మెల్యే

HYD: మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ వెంటనే ఈ ఘటనపై స్పందించి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

September 23, 2024 / 08:47 PM IST

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రజల వద్ద నుండి స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

September 23, 2024 / 08:46 PM IST

VZM : ప‌రిహారానికి అర్హులైన వారి జాబితాలు ప్ర‌ద‌ర్శించండి

VZM: జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు దెబ్బతిని ప్రభుత్వం నుంచి పరిహారం పొందేందుకు అర్హులైన వారి జాబితాలను సోమ, మంగలవారాల్లో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించినట్లు కలెక్టర్ డా.బిఆర్.అంబేద్కర్ తెలిపారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించి నివేదించాలని కలెక్టర్ తహసీల్దార్‌లను ఆదేశించారు.

September 23, 2024 / 08:46 PM IST