ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లు -2024కు దేశంలోని చాలా ముస్లిం సంస్థలు తమ మద్దతును తెలిపినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. స్క్రూటినీ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ విడుదల చేసిన వక్ఫ్ బిల్లు ముసాయిదాపై పెద్ద సంఖ్యలో సూచనలు వచ్చినట్లు తెలిపారు. వక్ఫ్ బిల్లు అమల్లోకి వస్తే ముస్లింల భూములు కబ్జాల బారినపడతాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. ఆ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని హెచ్చరిం...
★ 1950: టీమిండియా మాజీ క్రీడాకారుడు మోహిందర్ అమర్‌నాథ్ జననం,★ 1968: సినీ నటీ అక్కినేని అమల జననం,★ 1972: తెలుగు సినిమా దర్శకుడు శ్రీను వైట్ల,★ 2004: భారత అణు శాస్త్రవేత్త,★ ప్రపంచ నదుల దినోత్సవం,★ ప్రపంచ హృదయ దినోత్సవం.
పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్ తీరంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని డాకర్ తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో నుంచి 30 మృతదేహాలను నావికా దళం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అసలు ఆ పడవ ఎక్కడ నుంచి వచ్చిందో అన్న దానిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
లెబనాన్ రాజధాని బీరుట్‌లో మరోసారి లక్షిత దాడులు చేపట్టినట్లు తాజాగా ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతకుముందు దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 270 మందికిపైగా మృతి చెందారు. ఈ పరిణామాల దృష్ట్యా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఏటా శీతాకాలం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం తీవ్రంగా మారుతోంది. సమస్యను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పంట వ్యర్థాల దహనం ఘటనలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని పంజాబ్, హరియాణా,ఉత్తరప్రదేశ్ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీలంక ప్రస్తుత పార్లమెంటును మరో రెండు రోజుల్లో రద్దు చేయనున్నట్లు ఆ దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమారా దిసనాయకే వెల్లడించారు. దీంతో నవంబరులో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి శ్రీలంకలో వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇజ్రాయెల్-లెబనాన్‌లోని హెజ్‌బొల్లాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇవాళ హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. 21 మంది చిన్నారులు సహా 274 మంది మృతి చెందగా.. 700 మందికిపైగా గాయాలయ్యాయి. ఈ పరిణామాల మధ్య పశ్చిమాసియాకు అదనపు దళాలను తరలించినట్లు అమెరికా వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు 40 వేలమంది అగ్రరాజ్యం సైనికులు ఉన్నారు.
TG: భార్య మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకుంది. మహేశ్ గౌడ్(36) అనే వ్యక్తి తాగడానికి డబ్బులు అడగగా.. భార్య లేవని చెప్పడంతో గొడవపడ్డాడు. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TG: ఇటీవల కురిసిన వర్షాల దృష్ట్యా వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తం చేశారు. పంటల్లో చీడపీడలు, తెగుళ్ల బెడద పెరగటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరిలో బ్యాక్టీరియా, ఎండాకు తెగుళ్లు ఉన్నట్లు అధికారులు మంత్రికి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు శాస్త్రవేత్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సూచన...
తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘దేవర’ మూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిమిషాల వ్యవథిలోనే టికెట్లు ఖాళీ అయ్యాయి. రేపు రెండు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 27న 29 థియేటర్లలో అర్థరాత్రి ఒంటిగంట షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే టికెట్లు రెట్లను పెంచుకునే వెసులుబాటును కూడా రెండు ...
AP: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులకు అండగా ఉండాలనే పింఛన్ రెట్టింపు చేశామని అన్నారు. ‘దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవాళ్లకు రూ.15 వేలు ఇస్తున్నాం. అనర్హులు స్వచ్ఛందంగా తమ పింఛన్లు వదులుకోవాలి. తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులు పింఛన్ పొందితే అర్హులకు నష్టం జరుగుతుంది. వృద్ధులకు డిజిటల్ లిటరసీ ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి’ అని పేర్కొన్నారు.
AP: యూనివర్సిటీల్లో చదివి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికీ ఉద్యోగం రావాలని మంత్రి లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో నైపుణ్యాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్కిల్ సెన్సెస్, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించనున్నట్లు ఆయన...
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణించిన కారు రోడ్డుపై ఉన్న నీటి గుంతలో చిక్కుకున్నది. చాలా సేపు ప్రయత్నం చేసినా వాహనం ముందుకు కదలలేదు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ కారు నుంచి కిందకు దిగారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది స్థానికుల సహాయంతో ఆ వాహనాన్ని గుంత నుంచి బయటకు తోశారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒడిస్సా నుంచి హైదరాబాద్, ముంబై పట్టణాలకు తరలిస్తున్న 300 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు.. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ గంజాయి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో గంజాయిని తరలించడం వెనుక చాలమంది ప్రమేయం ఉందని.. మిగతా నిందితులను పట్టుకునే పని...
TG: BRS ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి విధ్వసం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడినా ప్రతి కార్యకర్త వరకు ప్రతీ ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలకు పా...