HNK: హనుమకొండ నగరంలో కేయూసీ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ అభివృద్ధి పనుల కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కిషన్‌పురలో కరెంటు నిలిపివేస్తున్నట్లు హనుమకొండ డీఈ సాంబరెడ్డి తెలిపారు. అదేవిధంగా విద్యుత్తు మెయింటెనెన్స్ కారణంగా 8 నుంచి 10:30 వరకు బొక్కలగడ్డ, శ్రీనగర్ కాలనీ, పోచమ్మ కుంట, కుమ్మరివాడ ప్రాంతాలలో కరెంటు ఉండదని చెప్పారు.
SKLM: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మెలియాపుట్టిలో జనసేన పార్టీ నాయకులు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం పూజలు చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కల్తీ నెయ్యి ప్రసాదంలో వాడటంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ELR: గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సద్గురు గ్రామంలో పలు కార్యక్రమాల్లో హాజరుకానున్నారు. అనంతరం కొమ్మూరులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఒట్టిగుడుపాడులో ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తారని క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
ఖమ్మం నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలను ఆదేశించారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం, తదితర సమస్యలపై పలు సూచనలు చేశారు.
ELR: పోలవరం మండలంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం పర్యటిస్తారని క్యాంపు ప్రతినిధులు తెలిపారు. తొలుత మండలంలో కొండ్రు కోట గ్రామంలో ఉదయం 8:30 నుండి 9:30 వరకు ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం లక్ష్మీనారాయణ దేవి పేట గ్రామంలో ఉదయం 10.00 గంటల నుండి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంటారన్నారు.
NDL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 135 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై అధికారులు చొరవచూపి పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ప్రతి పోలీస్ అధికారి చర్యలు చేపట్టాలన్నారు.
కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నేడు మంగళవారం పామర్రు టౌన్‌లో నిర్వహించే ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు డిప్యూటి C.M పవన్ కళ్యాణ్ చేస్తున్న పశ్చాత్తాప ధీక్షకు మద్దతుగా పామర్రు జనసేన పార్టీ ఇంఛార్జ్ తాడిశెట్టి నరేశ్ ఆధ్వర్యంలో మంటాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే దీక్షలో M.P వల్లభనేని బాలశౌరితో కలిసి పాల్గొంటారు.
RR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రక్త, కంటి, దంత, చర్మ, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. జిల్లా ప్రధాన జడ్జి శ్రీధర్ రెడ్డి NGOలను అభినందించారు. DLSA కార్యదర్శి శ్రీదేవి, జడ్జిలు పట్టాభిరామారావు, ADJలు పద్మావతి, ఆంజనేయులు, BAR కౌన్సిల్ PRSDT కొండల్ రెడ్డి, గోపీశంకర్ యాదవ్ ఉన్నారు.
కృష్ణా: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం ఆగిరిపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సద్గురు గ్రామంలో జరిగే పలు కార్యక్రమాల్లో హాజరుకానున్నారు. కొమ్మూరులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఒట్టిగుడుపాడు గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తారని తెలిపారు.
MLG: ‘స్వచ్ఛతా-హీ-సేవా’ కార్యక్రమాన్ని యజ్ఞంలా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో రివ్యూ అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అధికారులంతా జవాబుదారిగా వ్యవహరించాలని కోరారు. జిల్లాలో ప్రతి రోజు చేపట్టిన కార్యక్రమాల వివరాలను అన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని సీతక్క సూచించారు.
కృష్ణా: ఎంపీ శివనాథ్ మంగళవారం ఉదయం 9 గంటలకు విజయవాడ నైజం గేటు సెంటర్‌లో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం 10.30 గంటలకు PB సిద్ధార్థ కళాశాలలో జరిగే విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవంలో, సాయంత్రం 5 గంటలకు ఇంద్రకీలాద్రిపై జరిగే దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు.
CTR: ఉద్యానవన శాఖలో అమలు చేస్తున్న పలు పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో పథకాలను తెలిపే పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకానికి 40% రాయితీ అందిస్తున్నట్టు చెప్పారు. పాలి హౌసులు, షెడ్ నెట్ హౌసులు, మల్చింగ్‌కు 50% రాయితీ అందిస్తున్నామన్నారు.
స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన ప్లాగ్‌షిప్ మోడల్ ఎస్24 సిరీస్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ ఫోన్లపై ఏకంగా 15-35 శాతం మేర ధరలను తగ్గించింది. ఈ డిస్కౌంట్లు ఈ నెల 26 నుంచి ఫ్లిప్‌కార్టులో అందుబాటులోకి రానున్నాయి. ఈ ధరల తగ్గింపుతో ఎస్24 ఫోన్.. యాపిల్ 16 కంటే రూ.20 వేలు తక్కువకే లభిస్తుంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డులు, ఎక్స్ఛేంజ్ డీల్ ద్వారా మరింత తక్కువకే ఈ సిర...
శ్రీలంక ప్రధాని దినేశ్ గుణవర్దన తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో NPP నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినేశ్ తెలిపారు. దిసనాయకే ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన ప్రధానికి పదవికి రాజీనామా చేశారు. 2022 జూలై నుంచి తన రాజీనామా వరకు గుణవర్దన శ్రీలంక ప్రజలకు ప్రధానిగా తన సేవలను అందించారు.
లెబనాన్ కూడా మరో గాజాలా మారుతోందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. రోజు రోజూకు దాడులు ఉద్ధృతం కావటం పట్ల ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణపై ఇరు పక్షాలకూ ఆసక్తి లేదనే విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. కాల్పుల విరమించే దిశగా ఇరు దేశాలు అడుగులు వేయాలని కోరారు. న్యూయార్క్‌లో ఐరాస సాధారణ సభను ప్రారంభించే ముందు గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు.