స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన ప్లాగ్‌షిప్ మోడల్ ఎస్24 సిరీస్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ ఫోన్లపై ఏకంగా 15-35 శాతం మేర ధరలను తగ్గించింది. ఈ డిస్కౌంట్లు ఈ నెల 26 నుంచి ఫ్లిప్‌కార్టులో అందుబాటులోకి రానున్నాయి. ఈ ధరల తగ్గింపుతో ఎస్24 ఫోన్.. యాపిల్ 16 కంటే రూ.20 వేలు తక్కువకే లభిస్తుంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డులు, ఎక్స్ఛేంజ్ డీల్ ద్వారా మరింత తక్కువకే ఈ సిరీస్ ఫోన్లు లభించనున్నాయి.