AP: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదుచేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నోటీసులు ఇచ్చినా.. భూమన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు. అఖిలాండం దగ్గర ప్రమాణం చేయబోయిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా తిరుమల లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం కాదని భూమన తెలిపారు. తన హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రమాణం చేసేందుకు తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే.