తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘దేవర’ మూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిమిషాల వ్యవథిలోనే టికెట్లు ఖాళీ అయ్యాయి. రేపు రెండు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 27న 29 థియేటర్లలో అర్థరాత్రి ఒంటిగంట షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే టికెట్లు రెట్లను పెంచుకునే వెసులుబాటును కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్పించాయి.