ఒడిస్సా నుంచి హైదరాబాద్, ముంబై పట్టణాలకు తరలిస్తున్న 300 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు.. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ గంజాయి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో గంజాయిని తరలించడం వెనుక చాలమంది ప్రమేయం ఉందని.. మిగతా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు.