TG: భార్య మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకుంది. మహేశ్ గౌడ్(36) అనే వ్యక్తి తాగడానికి డబ్బులు అడగగా.. భార్య లేవని చెప్పడంతో గొడవపడ్డాడు. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.