పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్ తీరంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని డాకర్ తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో నుంచి 30 మృతదేహాలను నావికా దళం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అసలు ఆ పడవ ఎక్కడ నుంచి వచ్చిందో అన్న దానిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.