KDP: అక్రమంగా ఇసుక, ఎర్రచందనం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్సై మహమ్మద్ రఫీ అన్నారు. సిద్దవటంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడారు. కొండ సంపద, అక్రమ ఇసుక రవాణా జరగకుండా కొన్ని సమస్యాత్మక స్థావరాలలో నిఘా ఏర్పాటు చేశామన్నారు. పల్లె ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.